Featuredఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లా

సీఎం చంద్రబాబు చెప్పాడుగోరంట్ల రవికుమార్ చేశాడు.

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. వేలాదిమంది ప్రజల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ హర్షిణి కళాశాల అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల రవికుమార్ కు ఇద్దరు పేద విద్యార్థుల విద్య బాధ్యతను అప్పగించారు. తన అభిమాన నేత ఒక్క మాట చెప్పగానే మద్దిరాలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గోరంట్ల రవికుమార్ హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ తో కూడిన విద్య ను అందించేందుకు గోరంట్ల రవికుమార్ ముందుకు వచ్చారు. వేలాది మంది ప్రజలు అభిమానుల ఎదుట పేద విద్యార్థులను చదివించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరగా, తన బాస్ చెప్పిన వెంటనే ఇద్దరు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తానని గోరంట్ల రవికుమార్ సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *