పెన్షన్లపై శుభవార్త చెప్పిన సీఎం
అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘గతంలో చాలామంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారు. అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్లు అందిస్తాం. వచ్చే నెల మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తాం. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తాం’ అని వెల్లడించారు.