తెలంగాణమహబూబ్ నగర్ జిల్లా

తెలంగాణ దండోరా కమిటీలలో చేరిన మాదిగ సంఘాల నేతలు.

  • సంఘంలో చేరిన వారికి కండువా కప్పి, నియామక పత్రాలను అందజేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ.

మాదిగ జాతి హక్కుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ దండోరా మహబూబ్ నాగర్ జిల్లా అధ్యక్షుడు గంగారం భీమ్ రాజ్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ దండోరా చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు తెలంగాణ దండోరా సంఘంలో చేరడం జరిగింది. తెలంగాణ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకట రాములు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కొమ్ము రాజు మాదిగ, తెలంగాణ దండోరా రాష్ట్ర యువసేన ప్రధాన కార్యదర్శిగా తుంగ శ్యాంసుందర్ మాదిగ, తెలంగాణ దండోరా విద్యార్థి ఫోర్స్ మహబూబ్ నగర జిల్లా కన్వీనర్ గా కామారం శ్రీనివాస్ మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకొని, వారికి రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర జిల్లా అధ్యక్షుడు గంగారం భీమ్ రాజు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనుపాటి మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాదిగ, తెలంగాణ దండోరా నాయకులు, తెలంగాణ దండోరా విద్యార్థి ఫోర్స్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *