Featuredజోగులాంబ గద్వాల జిల్లాతెలంగాణ

పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ కి ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ.

గద్వాల్ :- ప్రతి ఉద్యోగి ఉద్యోగ జీవితం లో పదవీ విరమణ అనేది సహజం అని, ఉద్యోగిగా వారు చేసిన సేవలను డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ గుర్తించుకుంటుంది అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అన్నారు.జోగుళాoబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు కంట్రోల్ రూం విభాగం లో హెడ్ కానిస్టేబుల్ (1573) గా విధులు నిర్వహిస్తున్న శ్రీ బి . ఆధిశేషయ్య 1990 సంవత్సరం లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి సుమారుగా 34 సంవత్సరముల పాటు ఇటిక్యాల, వెల్దండ , శాంతి నగర్, బూత్పూర్, గద్వాల్ టౌన్, ధరూర్, గట్టు, కోదండపూర్లలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి శనివారం పదవి విరమణ పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు శాలువా ,పూలదండలువేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగికి రిటైర్మెంట్ అనేది సహజం అని , వీరు సుమారుగా 34 సంవత్సరముల పాటు ఏలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ శాఖకు సేవ చేయడం చాలా గొప్ప విషయం అని, విరి సేవలను పోలీస్ శాఖ ఎల్లప్పుడూ గుర్తించుకుంటుంది అని,వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరపున వారికి, వారి కుటుంబానీకి ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామన్నారు.రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామన్నారు.ఈ కార్యక్రమం చివర ఆదిశేషయ్య తన 34 సంవత్సరాల సర్వీస్ కాలంలో ఎదుర్కొన్నా అనుబావాలను వివరించి పదవి విరమణలో బాగంగా తనకు పోలీస్ శాఖతో ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ . ఓ సతీశ్ కుమార్, కంట్రోల్ రూమ్ ఇంచార్జి ఎస్సై రజిత , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *