Featuredఆంధ్రప్రదేశ్మంచి కథలు

99% శాతం ఫ్రీ డెలివరీ

ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే… MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు.. అలాంటి ఒకావిడ జీవితం మీకోసం… సూలగుత్తి నరసమ్మ: 97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలలో ప్రక్రృతి వైద్యం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. Specialist గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడుతారు., బెంగుళూరులోని అనేక Multi/Super Speciality ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు., తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు ….వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది., ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. “సూలగుత్తి” అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది., తను ఎటువంటి డబ్బులూ తీసుకోదు., ఎవరైనా తనకు డబ్బులు గాని, బహుమతులు గానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించినవారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది., ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. Tumkur యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *