Featuredఆంధ్రప్రదేశ్జాతీయంప్రకాశం జిల్లారాజకీయాలు

75 సంవత్సరాలు గా ఓబీసీ ల కులగణన…..!

గత 75 సంవత్సరాలు గా ఈ దేశం లోని పాలకులు ఓబీసీ ల కులగణన చేస్తాము అని అంటూనే కాలం వెళ్ళబుచుతూ, జనాభా లెక్కలు తియ్యవలసిన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక చారిత్రాత్మక సంఘటన జరుపుతూ కుల గణన ను పక్కదారి పట్టిస్తున్నారు.. ఆ నాటి కాంగ్రెస్ ప్రధాన మంత్రి నెహ్రు రిజర్వేషన్ లు ఇవ్వడం వలన మెరిట్ పోతుందని కులగననను వ్యతిరేకించాడు. అంతేకాక ambedkar గారు ఓబీసీ ల కులగనన కొరకు తన మంత్రి పదవికి రాజీనామా చేసి నెహ్రు మీద ఒత్తిడి చేయడం ద్వారా ఏర్పాటు చేయబడ్డ కాకకాలేల్కర్ కమిషన్ రిపోర్ట్ ను అమలుచేయకుండా, చెత్తబుట్టలో వెయ్యడం జరిగింది.
అ తరువాత ఏర్పడ్డ మండల్ కమిషన్ ఓబీసీ లు ఈ దేశం లో 52% అని చెప్పి, 52% రిజర్వేషన్ లు ఓబీసీ లకు ఇవ్వాలని చెప్తే, ఆ రిపోర్ట్ ను అమలుచేయకుండా ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా మండల్ కమిషన్ రిపోర్ట్ ను పక్కదారి పట్టించడం జరిగింది. అయితే 1992 లో జనాభా లెక్కలు తియవలసి వొచ్చినపుడు ఆ నాటి కాంగ్రెస్ హయం లో బాబ్రీ మస్జీద్ మీద దాడి చెయ్యడం ద్వారా ఓబీసీ ల కుల గననను పక్కదారి పట్టించి మండల్ ఉద్యమాన్ని కమండల్ ఉద్యమం గా మార్చారు. అంతేకాక 52% ఓబీసీ జనాభా కు కేవలం 27% రిజర్వేషన్ ను క్రీమిలేయర్ తో కలిపి ఇస్తూ ఓబీసీ లను శాశ్వతం గా మోసం చేసారు. తిరిగి 2002 లో ఓబీసీ ల కులగణన చేయవలసినప్పుడు గుజరాత్ అల్లర్లు, 2012 లో అన్న హాజరే అవినీతి ఉద్యమం పేరుతో ఓబీసీ ల కుల గణన అంశం పక్కదారి పట్టించడం జరిగింది.
ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుల గణన చెయ్యడానికి ఇష్టపడలేదు, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రిజర్వేషన్ ల వలన ప్రతిభ నష్ట పోతుందని చెప్పాడు.. కానీ bamcef సంస్థ దేశవ్యాప్తం గా ఓబీసీ లను జాగృతి చేస్తూ, రాష్ట్రీయ పిచడా వర్గ్ మోర్చా ద్వారా ఓబీసీ ల కులగణన ఉద్యమాన్ని నిర్మిస్తుంది.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓబీసీ లు చైతన్యం అవుతున్నారు.. 60 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ ఓబీసీ ల కుల గణన చెయ్యలేదు.. కానీ ఇప్పుడు అదే పార్టీ కి చెందిన రాహుల్ గాంధీ మా పూర్వికులు తప్పు చేసారు మేము సరుద్దిద్దుకుంటాము అని ఓబీసీ ల కుల గణన చేస్తాము అని చెప్తున్నారు.. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడ ఓబీసీ ల కుల గణన చెయ్యడానికి సంశిద్దతను తెలుపుతుంది.. దీనికి కారణం bamcef మరియు నేషనల్ ఓబీసీ మోర్చా నాయకులు అయినటు వంటి waman meshram గారు, చౌదరి వికాస్ పటేల్ గారు దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఓబీసీ ప్రజలను చైతన్య పరుస్తూ, సంగటిత పరుస్తు ఓబీసీ కుల గణన అంశాన్ని జాతీయ సమస్య గా చెయ్యడం జరిగింది.తద్వారా ఓబీసీ ప్రజలు నుండి ఒత్తిడి పెరిగి పాలక ప్రతిపక్ష వర్గాలు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ ఓబీసీ కుల గణన అనే జాతీయ అంశాన్ని వారి అజెండా గా మార్చుకోవడం జరిగింది. కనుక ఓబీసీ ప్రజలు తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, అధికారాలు తెలుసుకొని ఓబీసీ కుల గణన ను సాధిస్తారని ఆశిస్తున్నాము.
అలాగే ఈ మహా సభల్లో మరొక అతి ముఖ్య అంశం ఈవీఎం ల ద్వారా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం అని, తిరిగి పాత పద్ధతులో అనగా బాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలనే అంశాన్ని చర్చించడం జరిగింది. దీనికి గల కారణం అక్టోబర్ 8, 2013 తేదిన భారత సుప్రీం కోర్ట్ ఈవీఎం లతో జరిగే ఎన్నికలు పారదర్శికం గా ఉండవని తీర్పు ఇచ్చింది. పారదర్శకత పెంచడానికి ఈవీఎం లకు vvpat మెషిన్ జోడించమని తీర్పు ఇచ్చినప్పటికి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఈ పని చెయ్యకపోగా కేవలం ఈవీఎం లతో ఎన్నికలు జరుపగా, ఈ విషయమై bamcef సంస్థ జాతీయ అధ్యక్షులు waman meshram గారి ఆధ్వర్యంలో eci పైన sc లో case వేసి ఈవీఎం లకు vvpat లను జోడించేలా చెయ్యడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలలో పోలైన vote లకంటే ఎక్కువ vote లు రావడం., కొన్ని చోట్ల తక్కువ vote లు రావడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అంతేకాక eci రిప్రెసెంటేషన్ అఫ్ పీపుల్ యాక్ట్ లోని ఎలక్షన్ నియామవాలి లో అనేక మార్పులు చేసి ఎన్నికలు జరిపే విధివిదానా లపై అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే అటు కాంగ్రెస్ కానీ బీజెపీ కానీ ఈవీఎం లను తీసివేసి బాలట్ తో ఎన్నికలు జరిపించమని అడగడం లేదు. దీ అర్థం ఏమి అంటే పాలక ప్రతిపక్షాలు రెండు కూడా ఈవీఎం లను వాడుకుంటూ అధికారం ను తమవద్దే ఉంచుకొని ప్రాంతీయ పార్టీ లను అధికారం లోకి రానివ్వకుండా నెమ్మది నెమ్మదిగా ఆ పార్టీ లను నాశనం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నవి. ప్రజాస్వామ్యం కు ఓటు అనేది ప్రాణవాయువు లాంటిది. ఆ ఓటు కే విలువ లేనప్పుడు ప్రజాస్వామ్యం మనజాలదు.. నిజానికి ఇప్పుడు దేశం లో మేధావులు, విద్యావంతులు అందరూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం ను కాపాడాలి అని అంటున్నారు.. కానీ ఓటు ను కాపాడుకొమ్మని ఎవరు చెప్పడం లేదు.. నిజానికి ఈవీఎం లను తీసివేసి, బాలట్ పేపర్ విధానం ద్వారా మన ఓటు ను మనం కాపాడుకోగలిగితే, దేశం లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడ బడుతావని ఈ రెండు విషయాలను గూర్చి ప్రజ లను చైతన్య పరుస్తూ ఓబీసీ మహా సభలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా డా.. నాగన్న సార్, నేషనల్ ఓబీసీ మోర్చా స్టేట్ కన్వీనర్డా. హరిప్రసాద్ కంచర్ల, Cec మెంబెర్ నేషనల్ ఓబీసీ మోర్చా డా. క్రాంతి చైతన్య, నంద్యాల ఖదీరుల్లా, జిల్లా అధ్యక్షులు, బాంసెఫ్, కర్నూల్, డా. రాముడు, AP స్టేట్ ప్రెసిడెంట్ బాంసెఫ్, వెంకట్రావు గడ్డం భారత్ ముక్తి మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ AP. పలువురు ఈ సభలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *