కొరిసపాడు మేదరమెట్ల పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డి.ఎస్.పి
కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని పోలీస్ స్టేషన్ ను శనివారం డిఎస్పి మహమ్మద్ మెయిన్ సందర్శించారు. తొలుత ఆయనకు సీఐ మల్లికార్జునరావు, ఎస్సై మహమ్మద్ రఫీలు ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం డిఎస్పి స్టేషన్లో పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచన చేశారు.