Featuredఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లారాజకీయాలు

పేదలసేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి..

  • చక్రాయపాలెం గ్రామంలో పేదలసేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.
  • అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు.
  • అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల సైకిళ్లు పంపిణీ హామీ మేరకు
  • విడతల వారీగా పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.
  • చక్రాయపాలెం జెడ్పీ హై స్కూల్ లో 125 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు.

“విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తుందని” — మంత్రి గొట్టిపాటి తెలిపారు.అనంతరం
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు బాపట్ల ఎంపీ. కృష్ణప్రసాద్ గారితో కలిసి అద్దంకి మండలంలోని కుంకుపాడు, మోదేపల్లి, కొటికలపూడి పంచాయతీ పరిధిలోని పార్వతీపురం గ్రామాలను సందర్శించారు.
తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలు, వంతెనలు, గ్రామీణ రహదారులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి గారు రైతులతో మాట్లాడి నష్టస్థితిని వివరంగా తెలుసుకున్నారు. పంటనష్టం అంచనాలను సక్రమంగా నమోదు చేసి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ – “రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుంది. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *