ఇసుక టిప్పర్ పట్టివేత
మానవపాడు: గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రం మీదుగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను స్థానిక పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు.ఇసుక టిప్పర్ కు సంబంధించి అనుమతి,తదితర పత్రాలకు సంబంధించి విచారణ నిమిత్తం ఎస్సై చంద్రకాంత్ ఇసుక టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.